ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు… ప్రస్తుతం రాజకీయాలకు
గత రెండున్నర సంవత్సరాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని కుదిపేసి, ప్రాణాలను బలిగొన్న రోగాలు మళ్లీ రాకుండా ప్రజలను కాపాడాలని శ్రీవారిని ప్రార్థించానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకునారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఈ రోజు విడుదలైన గుజరాత్ ఎన్నికల ఫలితాలు నేను చూడలేదు. దేవుని సన్నిధిలో రాజకీయాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు. షర్మిలను త్రోయింగ్ చేసి తీసుకెళ్లడాన్ని ఖండిస్తున్నాం. షర్మిలకు నచ్చజెప్పి తీసుకెళ్లి ఉండాల్సింది. ప్రస్తుతం రాజకీయాలను నేనే దూరంగా ఉన్నాను. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్లమెంట్లో అందరి ఎంపీకల కంటే ఎక్కువ నిధులు తెచ్చుకున్నది నేను. ప్రస్తుతానికి నా నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి పెట్టాను అని అన్నారు.













