వయో పరిమితి లేకుండా…అందరికీ ఉచితంగా

వయో పరిమితి లేకుండా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడ రవీంద్రకుమార్ ప్రధాని మోదీని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రైవేటు భాగస్వామ్యం అవకాశం ఉన్న మేరకు తగ్గించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం కోటా నుంచే వ్యాక్సిన్ సేకరణ చేసి, జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రాలకు సరఫరా చేసిన వ్యాక్సిన్‍పై పర్యవేక్షణ కూడా కేంద్రమే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధరల విషయంలో వ్యత్యాసం లేకుండా చూడాలని, దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్ పక్రియను చేపట్టాలన్నారు.