హైదరాబాద్ కు దీటుగా గుంటూరు
హైదరాబాద్‌కు దీటుగా గుంటూరు నగరాన్ని సుందరీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరు కొరిటిపాడులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆలపాటి వెంకటరామయ్య పార్కు ప్రారంభోత్సవంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమచుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ఈ పార్కును అమృత పథకం కింద రూ.50 లక్షలు కేటాయించి సుందరీకరించడం అభినందనీయమన్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తోందన్నారు.













