ఏపీలో ఒకలా… తెలంగాణలో మరోలా
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూములను గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై పలు అనుమానాలు లేవనెత్తారు. సీసీ కెమెరాల పనితీరు సరిగా లేకపోయినా.. పర్యవేక్షణ సమర్థంగా లేకపోయినా ఓటింగ్ యంత్రాలను బయటకు తరలించే అవకాశం ఉందని సందేహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా రాష్ట్రంలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. సమీక్షా సమావేశాల నిర్వహణలో ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా జరుగుతున్నా ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు.













