MP Keshineni : యథావిధిగా విజయవాడ ఉత్సవ్ : ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav) కు ఎలాంటి వివాదం లేదని ఎంపీ కేశినేని శివనాథ్( చిన్ని) తెలిపారు. వివాదం ఎగ్జిబిషన్ కార్యక్రమానికి మాత్రమే అని అన్నారు. ఎగ్జిబిషన్ విజయవాడ ఉత్సవ్‌లో ఒక భాగం మాత్రమేనని వెల్లడిరచారు. నగరంలో తుమ్మలపల్లి (Tummalapalle) కళాక్షేత్రం, పున్నమిఘాట్ (Punnamighat) , ఘంటసాల సంగీత కళాశాలలో జరిగే విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయన్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు దర్శనంతో పాటుగా విజయవాడ ఉత్సవ్ ఆనందం, ఆహ్లాదం కలిగించేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.