ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత : అవినాష్ రెడ్డి
బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసినా డిపాజిట్ కూడా దక్కలేదని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బద్వేలు ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు రెఫరెండంగా భావించారని అన్నారు. ప్రజలు దేశం మొత్తం గర్వించేలా సీఎం వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరిచారన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలుపెరగకుండా కష్టపడ్డారని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమిష్టిగా పనిచేశారని తెలిపారు. టీడీపీ, బీజేపీకి పూర్తి సహకరించిందని విమర్శించారు. ఈ గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. మరింత మన్ననలు పొందేలా పనిచేస్తామని స్పష్టం చేశారు.













