తెలంగాణ పర్వతారోహకుడికి ఏపీ ప్రభుత్వం సాయం
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్వతారోహకుడు తుకారాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.35 లక్షల ఆర్థిక సాయం అందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలంయలో కలిశారు. ఆర్థికసాయానికి సంబంధించిన చెక్కును ప్రభుత్వాధికారులు ఆయనకు అందజేశారు. రంగారెడ్డి జిల్లా తక్కెళ్లపల్లి తండాకు చెందిన తుకారం ఎవరెస్టు శిఖరంతో పాటు ఐదు ఖండాల్లోని అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు. భవిష్యత్తులో కూడా సాయం అందిస్తామమంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు హామీ ఇచ్చారని తుకారం తెలిపారు.













