ఏపీ శాసన మండలి చైర్మన్ గా కొయ్యే మోషెన్ రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ పీఠం పై తొలిసారిగా దళిత వ్యక్తి ఆశీనులయ్యారు. శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషన్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని గంగుల ప్రభాకర్‌రెడ్డి ప్రతిపాదించగా సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ రావు, బల్లి కళ్యాణ చక్రవరి బలపర్చారు. రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మాణ్యం ప్రకటించారు. రాజును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఇతర పార్టీల నేతలు తొడ్కొనివచ్చి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయనకు అభినందనలు తెలిపారు.













