నీ ఓటును అమ్ముకోకు సోదరా.. వైరల్ అవుతున్న మోహన్ బాబు స్టేట్మెంట్..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రీసెంట్గా తన 72వ పుట్టినరోజు జరుపుకున్నారు. మార్చ్ 19న ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మోహన్ బాబు యూనివర్సిటీ 32వ వార్షికోత్సవంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.. ఎవరికి ఓటు వేయాలి.. రాష్ట్రానికి ఎవరు అవసరమైన నాయకుడు లాంటి విషయాలపై మోహన్ బాబు వ్యాఖ్యానించారు. కుండ బద్దలు కొట్టినట్టు ,ఉన్నది ఉన్నట్టు, ముక్కుసూటిగా మాట్లాడడం మోహన్ బాబు కి మొదటి నుంచి అలవాటు. రాజకీయాలలో కూడా అనుభవం ఉన్న వ్యక్తిగా మోహన్ బాబు నేటి రాజకీయ పరిస్థితి గురించి ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో మళ్లీ మోడీ ప్రభుత్వమే రావాలి అని ఆకాంక్షించారు. తాను మోడీని ఎన్నోసార్లు కలిసినట్లు చెప్పిన మోహన్ బాబు.. అలాంటి వ్యక్తి ఆలోచనలు విధానాలు భారతదేశ పురోగతికి ఎంతో అవసరం అని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాకు ఓటు వేయండి అంటూ ఎవరన్నా డబ్బులు ఇస్తే.. తీసుకునే ముందు అవి మన దగ్గర వసూలు చేసి మనకే ఇస్తున్న డబ్బులని గమనించమని ఆయన సూచించారు. ఎవరికి ఓటు వేస్తే ప్రగతి ఉంటుందో ఆలోచించి మరీ వారికే వేయండి కానీ పథకాలు ఇస్తున్నారనో.. లేక డబ్బులు పంచుతున్నారని ఓటుని అమ్ముకోవద్దని మోహన్ బాబు రిక్వెస్ట్ చేశారు.













