ఏపీ మండలి చైర్మన్ గా.. మహ్మద్ ఇగ్బాల్!

ఆంధప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి నూతన చైర్మన్‍గా హిందూపురంకు చెందిన మైనార్టీ నేత, ఎమ్మెల్సీ, మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇగ్బాల్ వైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతాధికారిగా కూడా ఆయన పనిచేశారు. 2019లో మహ్మద్ ఇగ్బాల్‍కు అధికార వైఎస్‍ఆర్ సీపీ పార్టీ హిందూపురం సీటు ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన సినీనటుడు బాలకృష్ణ చేతిలో పరాజయం పాలైయ్యారు.
మధ్యనే మరోసారి ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2027 మార్చి 29వ తేదీ వరకూ ఇగ్బాల్ ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ఇప్పటి వరకు మండలి చైర్మన్‍గా వ్యవహరించిన షరీఫ్ అహ్మద్ పదవీ విరమణ చేశారు. ఇక మండలి నుండి షరీఫ్ పదవీ విరమణ పొందడంతో మండలి చైర్మన్ ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కొత్త చైర్మన్ ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.