ఏపీలో గెలవబోతున్నాం.. కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ గెలవబోతోందని, కేంద్రం లోనూ చక్రం తిప్పబోతున్నామని తెలుగుదేశం ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ తమ గెలుపుపై ఎటువంటి అనుమానం లేదన్నారు. 2014లో వైకాపా ఏవిధంగా అయితే భంగపడిందో అదేవిధంగా మరోమారు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. గత ఎన్నికల ఫలితాలకు ముందు కూడా వైకాపా ఇదే విధంగా హంగామా చేశారన్నారు. ఏపీ ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కాంక్షించి ఓటు వేశారు కనుక చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ నెల 23 తర్వాత వైకాపా నేతలు, నాయకులకు రాష్ట్ర స్థాయిలో, దేశస్థాయిలో కూడా ఎటువంటి పని ఉండదని, సొంత వ్యాపారాలు, లెక్కలు చూసుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు.













