అదే ఏపీలో చిన్న తప్పు జరిగుంటేనా….
స్విస్ బ్యాంక్‌లో దాచుకున్న దోపిడీ సొమ్ము కోసమే వైఎస్ జగన్ స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లారని తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరిని చూసి మీరు భయపడుతున్నారు? ఎందుకు తెలంగాణ పరిణామాలపై స్పందించట్లేదని అధికారులను ప్రశ్నించారు. టీటీడీ బంగారాన్ని కూడా వైసీపీ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో ఏం జరిగినా రాబందుల్లా బయటికి వచ్చిన వారు.. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు మరణిస్తే ఎందుకు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. ఏపీలో విద్యార్థుల గురించి మాట్లాడిన పెద్ద మనుషులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘంపైనా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మంత్రి మండలి నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై రివ్వూ చేసే అధికారం సీఎస్‌కు ఎక్కడది అని ప్రశ్నించారు.













