సీఎం ఆపద్ధర్మ సీఎం కాదు.. పూర్తి స్థాయి సీఎం
జగన్ కేసులో ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఏ రకంగా సీఎస్‌గా నియమిస్తారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. సీఎం సమీక్ష జరిపితే తప్పు ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. సీఎం ఆపద్ధర్మ సీఎం కాదు..పూర్తి స్థాయి సీఎం అని ఆయన అన్నారు. పోలవరం, రాజధాని పనులు ఎవరు చూడాలని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో ఈసీ కోడ్ గురించి మాట్లాడటం సరికాదన్నారు. సీఎంగా చంద్రబాబు పదవీకాలం పదేళ్లు ఉంటుందన్నారు. 2014 జూన్ 7న చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారని, 2019 జూన్ 6 వరకు సీఎంగా చంద్రబాబు ఉంటారన్నారు. పోలింగ్ అయ్యాక కూడా ప్రజల సంక్షేమం చూడకూడదు అని చెప్పడానికి ఈసీ ఎవరని ప్రశ్నించారు. కౌంటింగ్ అయ్యేవరకు సీఎం సమీక్షలు జరపకపోతే.. ప్రజల సమస్యలు ఎవరు పరిష్కారిస్తారని అన్నారు.













