ఏపీ మండలి చైర్మన్ గా మోసేను రాజు ?
ఆంధప్రదేశ్ శాసన మండలి నూతన చైర్మన్గా మోసేను రాజు పేరు పరిశీలనలో ఉన్నట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీగా ఆయన నియామకానికి గవర్నరు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవుల్లో ఒకటి ఎస్సీకి, రెండోది బీసీ లేదా మైనారిటీ వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదనపై వైకాపా చర్చిస్తోంది. శాసనసభ సభాపతి పదవిని బీసీ వర్గానికి చెందిన తమ్మినేనికి ఇచ్చినందువల్ల మండలి చైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని వైకాపా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగానే మోసేను రాజు పేరు పరిశీలనకు వచ్చిందని వైకాపా నేత ఒకరు తెలిపారు. ఇలా చేస్తే డిప్యూటీ చైర్మన్ పదవి బీసీ లేదా మైనారిటీ వర్గానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.













