బీసీలను అణగదొక్కేలా వైసీపీ వ్యవహరిస్తోంది..ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
ఇటీవల ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ లోకి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతనిపై తన మండలి చైర్మన్ మోషేను రాజు అనర్హత వేటు వేశారు. నిన్న అర్ధరాత్రి కృష్ణమూర్తి పై వేటు వేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. దీనిపై స్పందించిన కృష్ణమూర్తి.. తన నుంచి ఎటువంటి వివరణ తీసుకోకుండానే తనను పదవి నుంచి తొలగించినందుకు మండిపడ్డారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇవ్వలేదని.. బీసీ వర్గాలకు ఇచ్చిన పదవి ఇది అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ అధిష్టానం కావాలని చైర్మన్ పై ఒత్తిడి తీసుకువచ్చి తనపై వేటు వేసేలా చేసింది అని కృష్ణమూర్తి విమర్శించారు. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం.. తర్వాత వదిలేయడం వైసీపీ నైజం అని దుయ్యబట్టారు. బీసీలను అణగదొక్కడానికి ఇది వారు చేస్తున్న ప్రయత్నమని.. కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పర్సనల్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకున్న కృష్ణమూర్తి ఇటీవల పార్టీని మారి పసుపు తీర్థం పుచ్చుకున్నారని పేర్కొన్న కృష్ణమూర్తి అతని విషయంలో ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు.













