ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా జకియా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి తొలిసారి మైనారిటీ మహిళకు దక్కింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జకియా మాట్లాడుతూ ఈ గౌరవప్రదమైన స్థానానికి తనను అర్హులుగా గుర్తించి మంచి ఉద్దేశంతో పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. మహిళల సంక్షేమ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మహిళా పక్షపతి అని నిరూపించుకున్నారని ఆమె కొనియాడారు. దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా ఉందన్నారు. ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు వైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. మైనార్టీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదలకు తోడ్పడుతానని ఆమె భరోసా ఇచ్చారు.













