మళ్లీ సీఎంగా చంద్రబాబే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబే వస్తారని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. శాసనమండలిలో ఎమ్మెల్సీగా అశోక్ బాబు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అశోక్బాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. పార్టీ తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 60 ఏళ్ల తర్వాత ఉద్యోగ సంఘాల నుంచి తనకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని చెప్పారు. ఈవీఎంలపై తమ పార్టీ ఉద్యమం కొనసాగుతుందని సృష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. సీసీఎస్ విధానాన్ని రద్దు చేయాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు కనకమేడల రవీంద్ర కుమార్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.













