రోజా, రజినీలకు కేబినేట్ బెర్త్ లు ఖరారు చేసిన జగన్…?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతున్నది. మంత్రివర్గం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారు అని వార్తలు మీడియా వర్గాల్లో కనపడుతున్నాయి. అయితే క్యాబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లోకి రావడానికి చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారట. ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు ఈ విషయంలో కాస్త ఆసక్తిగా ఉన్నారు.
అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని సమాచారం. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని విషయంలో అలాగే నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విషయంలో ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నారని వైసిపి వర్గాలు అంటున్నాయి. పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా జగన్ వెంటనడిచారు రోజా. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంను ఇబ్బంది పెట్టే విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారేవి.
ఆమెకు నియోజకవర్గంలో కూడా మంచి పేరు ఉండటమే కాకుండా సమర్థవంతమైన నేతగా కూడా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. అయినా మంత్రులు కొంతమంది పెద్దగా మీడియాతో మాట్లాడటం లేదు. ఈ తరుణంలో రోజా కేబినెట్ లోకి వస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది అనే భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని సమాచారం. దీంతోనే ఆర్.కె. రోజా దూకుడుగా వ్యవహరిస్తున్నారని త్వరలోనే ఆమెను క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని విషయంలో కూడా జగన్ సానుకూలంగానే ఉన్నారు అనే భావన ఉంది. విడదల రజిని తెలుగుదేశం పార్టీ అగ్రనేత పత్తిపాటి పుల్లారావు ని ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక నియోజకవర్గంలో కూడా చాలా మంచి పేరు ఉంది. ఎంపీ లావు కృష్ణదేవరాయలు తో విభేదాలు ఉన్నా సరే వాటిని పరిష్కరించే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రజిని క్యాబినెట్ లోకి రావడానికి ఆసక్తికరం గా ఉంటే కచ్చితంగా క్యాబినెట్ లో కి తీసుకోవడానికి జగన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బీసీ కోటాలో ఆమెను క్యాబినెట్ లో తీసుకోవచ్చు అని అంటున్నారు. ఆర్థికంగా కూడా బలంగా ఉన్న నేత కావడంతో ఆమెను ముందుకు నడిపించడానికి జగన్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.













