తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె
తన కుమార్తె షాబాన ఖాతూం ను వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసిన ఎం ఎల్ ఎ. శ్రీ జాలీల్ ఖాన్
ప్రజావేదికలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్. మంగళవారం తండ్రి జలీల్‌ఖాన్‌తో పాటు షబానా ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం సమక్షంలో షబానా టీడీపీలో చేరారు. మొదటి నుంచి తాను సీఎం అభిమానినని, అమెరికాలోని వర్జీనియాలో టీడీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నానని తెలిపారు. అమెరికా నుంచి తమ కుటుంబం ఏపీకి వచ్చేసిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో విజయవాడ పశ్చిమలో ప్రచారం ప్రారంభిస్తానని షబానా ఖాతూర్ చెప్పారు.













