అంబటి రాంబాబు కు కరోనా పాజిటివ్
వైసీపీ నేతలంతా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలుగు చూశాయి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్, మరోసారి చేసిన పరీక్షలో అంబటికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.













