Adinarayana Reddy: కడప జిల్లాలో జగన్‌కు సూపర్ చెక్ పెడతాం : ఆదినారాయణరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 ( పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని పీ5గా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) అభివర్ణించారు. ఐదో పి ని పవర్‌పుల్ అని ఆయన పేర్కొన్నారు. వైఎస్పార్ కడప జిల్లా జమ్మలమడుగు (Jammalamadugu) నియోజకవర్గం గూడెం చెరువులో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో చంద్రబాబు ( Chandrababu) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేశ్ (Minister Lokesh ) ను తండ్రికి మించిన తనయుడంటూ సీఎం చంద్రబాబు ఎదుట ప్రశంసించారు. ఈ క్రమంలో జగన్ (Jagan ) పై ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ లిక్కర్ డెన్‌ల డాన్., సూపర్ సిక్స్ పథకాలతో కడప జిల్లాలో జగన్‌కు సూపర్ చెక్ పెడతాం అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.