మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సకు అదనపు బాధ్యతలు
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల విభాగానికి మంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పట్టణ పరిధిలో ఉండే వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల విభాగానికి మంత్రిగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.













