మంత్రి సోమిరెడ్డి అమెరికా పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ నెల 16 నుంచి ఐదు రోజుల పాటు అమెరికా పర్యటకు వెళ్ళనున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జరుగుతున్న సేద్యంపై అధ్యయనం చేసేందుకు ఆయన ఈ టూర్‌కు వెళ్ళనున్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం చికాగో నగరం చేరుకుంటారు. అక్కడ యాంబసీలో బసచేస్తారు. అమెరికా టూర్‌పై దిలీప్‌తో చర్చిస్తారు. 17వ తేదీ అమెరికా మాజీ వ్యవసాయ శాఖ మంత్రితో సమావేశం అవుతారు. జాన్ డీర్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి సింజెంటా విత్తన పరిశోధనా కేంద్రాన్ని సందర్శిస్తారు. 18వ తేదీ ఏమ్స్‌లోని విత్తన పరిశోధనా కేంద్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 19వ తేదీ అక్కడే ఏమ్స్ ముఖ్యమంత్రితో నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరిగే సమావేశంలో పాల్గొంటారు. 20వ తేదీ చికాగో నగరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21వ తేదీన చికాగో నుండి బయలు దేరి హైదరాబాద్ చేరుకుంటారు.













