అమెరికాలో మంత్రి సోమిరెడ్డి పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం మంగళవారం బయలుదేరి వెళ్లారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో మే 31, జూన్ 1, 2 తేదీల్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన హాజరుకానున్నారు. ఈ నెల 11న అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ వాసిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి మూడు రోజుల పాటు డల్లాస్ నగరంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి సోమిరెడ్డి ప్రభుత్వం తరపున తెలుగు ఎన్ఆర్ఐల ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమెరికాకు పయనమైన ఆయన ఈ నెల 3వ తేదీన తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.













