Minister Satyakumar: మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం: మంత్రి సత్యకుమార్

అంతరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav) నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) అన్నారు. 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. నగరంలోని ఓ హోటల్‌లో ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకలు విజయవంతం చేయడంపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ దసరా(Dussehra) అంటే ప్రజలకు విజయవాడ (Vijayawada) వెళ్లాలనిపించేలా, దేశం మొత్తం ఇటు వైపు చూసేలా ఈ వేడుకలు నిర్వహిస్తాం. నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయి. ఈ ఏడాది మొదలు పెట్టిన చిన్న ప్రయత్నం ప్రపంచానికి విస్తరించేలా చేస్తాం. మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం. ఈ జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో నాకు భాగస్వామ్యం కల్పించడం సంతోషంగా ఉంది అని అన్నారు.