మీ బ్రదర్ ను ఓడించారు… మీపై కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కు అడ్రస్ ఉందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నటుడిగా పవన్ను గౌరవిస్తానన్నారు. వీకెండ్స్ లో వచ్చి వెళ్లడం రాజకీయం కాదన్నారు. హీరో వస్తే ఓట్లు వేస్తారన్నది గతం అన్నారు. మీ బ్రదర్ ను ఓడించారు. మీపై కూడా నమ్మకం లేదని గుర్తించాలన్నారు. పవన్, అతని అన్నలు రాజకీయాలకు సూట్ కారని అన్నారు. పవన్ పక్కన నాదెండ్ల, నాగబాబు తప్ప ఇంకెవరున్నారని ప్రశ్నించారు. పవన్ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదన్నారు. పవన్ అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయలేరు. జగన్ ను ఏం ఓడిస్తారని ప్రశ్నించారు.













