మూడు రాజధానులకు మద్దతుగా …విజయదశమి రోజున
విజయదశమి రోజున ప్రజలందరూ దేవాలయాలకు వెళ్లి మూడు రాజధానులకు మద్దతుగా పూజలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలను మంత్రి కారుమూరు నాగేశ్వరరావుతో కలిసి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అలాంటి ప్రభుత్వానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాలు సమానంగా అభివృద్ధి చేందాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం కోసం జగన్ పోరాటం చేస్తుంటే తన బినామీలను కాపాడుకోవడానికి 29 గ్రామాల కోసం చంద్రబాబు నాయుడు నకిలీ పోరాటం చేస్తున్నారని విమర్శించారు.













