వెనుకబడిన జిల్లాల కోసమే… మూడు రాజధానులు : మంత్రి రోజా
వెనుకబడిన జిల్లాల కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పరిపాలన రాజధానిగా వైజాగ్ కాబోతోందని అన్నారు. శాసనసభలో, శాసనమండలిలో తమకు బలం ఉందన్నారు. వికేంద్రీకరణ బిల్లును త్వరలోనే పెడతాం. ఎప్పుడు పెడతామో మీరే చూస్తారు కదా? అని అన్నారు. అయితే ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేసి అపుతున్నారని అన్నారు. జగన్ ఎలా అయినా గద్దె దించాని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ను ప్రజలు నమ్మరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 కి 175 స్థానాలు వస్తాయని అన్నారు.













