ఆధారాలు ఉంటే చూపించు.. పవన్ కల్యాణ్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు..
మంత్రి రోజాపై జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ఏవైనా ఆధారాలు ఉంటే చెప్పాలని అన్నారు. అంతేకాకుండా ఆధారాలను బహిర్గతం కూడా చేయొచ్చని, పేరులో రాయల్ అని చేర్చుకుంది జనసేన పార్టీ నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకే అని తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొన్న రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం జనేస అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పరిస్థితి ఏమీ అర్థం కాకుండా మారిందని అన్నారు. తెగిన గాలిపటంలో పవన్ పరిస్థితి మారిందంటూ చురకలంటించారు. ఎప్పుడు ఎవరిని కలుస్తారో, ఏ పార్టీతో మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆమె విమర్శించారు. అంతేకాకుండా కల్యాణ్‌ను ఎంతో అభిమానించే మోదీ కూడా ఇప్పుడు పక్కన పెట్టేశారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చని, రోజుకో పార్టీ వైపు మాట్లాడుతూ.. రౌడీయిజం చూపిస్తున్న పవన్ ప్రవర్తన కారణంగానే మోదీ దూరం పెట్టారని తెలిపారు.













