సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధిశాఖ మంత్రి ఆర్కే రోజా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కుటుంబసమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడిరచారు. జగనన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు. అన్న ఆశీస్సులే అండగా టూరిజం డెవలప్మెంట్కు చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు.













