సినిమాల్లో గబ్బర్ సింగ్..రాజకీయాల్లో రబ్బర్ సింగ్
చంద్రబాబు సైకోకు పరాకాష్టగా మారారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ జనం రాకపోవడంతో రోడ్లపై సభలు పెడుతున్నారు. చంద్రబాబు, పవన్‌కు పదవులే ముకం, 2 చోట్ల ఓడిన పవన్‌ను చూసి ఎవరు భయపడరు. పవన్ సినిమాల్లోనే గబ్బర్ సింగ్ రాజీకీయాల్లో రబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. పవన్ ఎప్పటికి రాజకీయ నాయకుడు కాలేడు. నన్ను డైమండ్ రాణి అన్నారు. నేను నిజంగా రాణినే. ఇంట్లో రాజకీయంగా, నటిగా నన్ను నేను నిరుపించుకుని రాణిలా ఉన్నాను. మరోసారి పవన్ నా గురించి మాట్లాడితే బాగుండదు. చిరంజీవికి నాకు ఎలాంటి గొడవలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు.













