ఆ ఘనత సీఎం వైఎస్ జగన్ దే : మంత్రి రోజా
రాష్ట్రంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేసిన ఘనత ఆంధ్రద్రపేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికే దక్కిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవగాహన లేకుండా మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఏపీలోని సంక్షేమ పథకాలు అమలు కావల్లేదు. ఆరోగ్య శ్రీ బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడుంది అని ప్రశ్నించారు. 32 లక్షల ఇళ్ల పట్టాలు బీజేపీ పాలిత రాష్ట్రాలన్ని కలిపి ఇచ్చాయా? అన్నారు. కేంద్రం అప్పుడు చేయడం లేదా? బీజేపీ సీఎంలు అప్పులు చేయడం లేదా? అని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌తో కలిసి బీజేపీ, ఏపీకి అన్యాయం చేసిందన్నారు. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి అని సవాల్ విసిరారు.













