ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన వైసీపీ సభలో ఆయన మాట్లాడుతూ ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయన్నారు. వైసీపీ బలంగా ఉందని, తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వేరే పార్టీలపై ఆధారపడుతున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తానేమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు.













