ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుంది : పయ్యావుల
వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశశ్ అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అమరావతిలో పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్‌కు ఆప్ప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్‌కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడమేంటని నిలదీశారు.













