Minister Lokesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి : మంత్రి లోకేశ్ పిలుపు

పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని, పెట్టుబడులతో తమ రాష్ట్రానికి రావాలంటూ తమిళనాడు (Tamil Nadu) లోని కోయంబత్తూర్ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పిలుపునిచ్చారు. కోయంబత్తూర్ (Coimbatore) లోని పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందన్నారు. పరిశ్రమలకు ఏకగవాక్ష అనుమతులతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారుల అనుకూల విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
పారిశ్రామికవేత్తలు సమగ్ర ప్రాజెక్టు నివేదికతో రాష్ట్రానికి వస్తే నిర్మాణం పూర్తయ్యేవరకూ పర్తి బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తు వాయు, జల, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని పరిశ్రమల అనుకూల విధానాలతో ఇప్పటికే జాతీయ (National) , అంతర్జాతీయ (international) సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.