అక్టోబరు 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికాలో లోకేశ్ పర్యటన
                                    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈనెల 25 నుంచి నవంబరు 1 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో జరిగే ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు ఆయన అతిధిగా హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా, ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో లోకేశ్ సమావేశం అవుతారు.
మరోవైపు ఏపీలో ఇటీవలే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం… రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోగతికి వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో లోకేశ్ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిరది. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి అమెరికా టూర్ వేస్తున్నారు. లోకేష్ చేతిలో ఐటీ శాఖ ఉంది. దాంతో ఆయన ఏపీకి ఐటీ పరంగా పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ఈ పర్యటన చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ కంపెనీల ప్రతినిధులతో లోకేష్ పలు కీలకమైన భేటీలు నిర్వహించనున్నారు. ఏపీలో పెట్టుబడులను తీసుకుని రావాలని తద్వారా ఏపీలో ఉపాధి కల్పన అవకాశాలను పెంచాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఐటీ శాఖను దాని కోసం వినియోగించుకుంటున్న లోకేష్ ఏపీలో ఐటీ సెక్టార్ ని బలోపేతం చేసే దిశగా యాక్షన్ ప్లాన్ ని రూపొందించారు. ఏపీలో ఈ రోజున విశాఖ ఐటీ పరంగా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత విజయవాడ తిరుపతిలలో ఐటీ సెక్టార్ ని డెవలప్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అదే విధంగా టైర్ టూ సిటీస్ లోనూ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఐటీ రంగం అభివృద్ధి చెందితే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని సేవా రంగం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారు. లోకేష్ ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీలు వేసైనా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు.







