2019 నాటికి 10 ఫోన్లలో ఐదు ఇక్కడే కావాలి
చిత్తూరు జిల్లాలోని రేణిగుంట ఈఎంసీ క్లస్టర్‌కు కేంద్రం ఆమోదం తెలపడంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి హబ్‌గా తయారుచేయాలని పెట్టుకున్న లక్ష్యానికి ఈ నిర్ణయం మరింత వూతమిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో 10 ఫోన్లలో రెండు మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయని, 2019 నాటికి 10లో 5 ఫోన్లు ఇక్కడే తయారు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. త్వరలో అనంతపురంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.













