Minister Lokesh: భవిష్యత్తులో అందరికీ న్యాయం : మంత్రి లోకేశ్
నామినేటెడ్ పదవులు రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan )లో ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. పులివెందులలో 45 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచిందని, దీన్ని చూసి వైసీపీ (YCP) ఓర్వలేకపోతోందన్నారు. రాయలసీమ (Rayalaseema)ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరతామని చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు.













