సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల వివరాలను మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి ఆస్తుల వివరాలను ప్రకటించారు. చంద్రబాబు పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 2.9 కోట్లు. నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.31.01 కోట్లు. నారా లోకేష్ ఆస్తి వివరాలు రూ.21.40 కోట్లు. నారా బ్రహ్మణి ఆస్తి విలువ రూ.7.72 కోట్లు. నారా దేవాన్ష్ ఆస్తి విలువ 18.71 కోట్లు. హెరిటేజ్ ఆస్తుల నికర లాభం రూ.60.38 ఓట్లు. హైదరాబాద్లో ఇంటి విలువ రూ.8 కోట్లు. నారావారిపల్లేలో నివాసం విలువ 23.83 లక్షలు. నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తులు రూ.6.83 కోట్లు. చంద్రబాబు ఆప్పులు రూ.5.31 కోట్లు. భువనేశ్వరి అప్పులు రూ.22.35 కోట్లు అని లోకేష్ తెలిపారు. రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఆస్తుల వివరాలు ప్రకటించామని లోకేష్ అన్నారు.













