Minister Lokesh:ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల : మంత్రి లోకేశ్

తల్లికి వందనం పెండిరగ్ దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆమోదించారు. విద్యాశాఖ (Education Department ) పై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేశ్ తల్లికి వందనం పెండిరగ్ నిధులు రూ.325 కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee reimbursement) నిధులు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక నుంచి ఏటా డీఎస్సీ (DSC) ప్రకటించి ఖాళీలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. శిక్షణా కార్యక్రమాల పేరుతో టీచర్ల (Teachers) సమయం వృథా చేయవద్దని సూచించారు. మెరుగైన ఫలితాలు వచ్చేలా చూసే బాధ్యత అధికారులు, టీచర్లదేనని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల విధానాలు స్టడీ చేసి ఉత్తమ ప్రీస్కూల్ పాలసీ సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో సైన్స్, స్పోర్ట్స్ ఫేర్‌లు నిర్వహించాలని అధికారులకు సూచించారు.