సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో మంత్రి లోకేష్ భేటీ
ఏపీలో సియోల్ సెమీ కండక్టర్స్ డిస్ ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి
సియోల్ (సౌత్ కొరియా): సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీ (Mr. Taehyung Lee)తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… 2026లో భారతదేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 25శాతం, గత 24నెలల్లో 240 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని చెప్పారు. పరిశ్రమ అవసరాలను గుర్తించి, నైపుణ్యాలను అందించడానికి నైపుణ్యం, కౌసలం పథకాలను ప్రారంభించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కియా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కెమ్, ఎంసీఎన్ఎక్స్ (కెమెరా మాడ్యూల్స్), సోలమ్ (ఏసీ విడిభాగాలు), హ్వేసంగ్ (పాదరక్షలు) వంటి 40కి పైగా కొరియన్ కంపెనీలు తమ యూనిట్లను నెలకొల్పాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉందని, బుల్లెట్ రైళ్లు, రేర్ ఎర్త్ కారిడార్లు, గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరాన్ని నిర్మించడంలో కేంద్రం మద్దతుతో ఏపీ ముందుకెళుతోందన్నారు. ఇటీవల ఇండియా సెమీ కండక్టర్స్ మిషన్ (ISM) ఆమోదించిన ప్రాజెక్ట్ ఏఎస్ఐపీ, ఏపీఏసీ లిమిటెడ్ కొరియన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిని శ్రీసిటీ లేదా దాని పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీ కండక్టర్స్ సంస్థ తమ డిస్ప్లే ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.
సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీ మాట్లాడుతూ… తమ సంస్థ గతనెలలో ప్రపంచంలోనే మొట్టమొదటి హెచ్ వీ ఆప్టో సెమీ కండక్టర్ ను ప్రారంభించిందని చెప్పారు. భారత్ లో తమ సంస్థ ప్రస్తుతం సేల్స్, డిస్ట్రిబ్యూషన్ కార్యాలయానికి మాత్రమే పరిమితమైనట్లు తెలిపారు. భారత్ లో నేరుగా లేదా జాయింట్ వెంచర్ ద్వారా పెట్టుబడి ప్రణాళికలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.








