Nara Lokesh: సత్వ గ్రూప్ ఎండి బిజయ్ అగర్వాల్ తో మంత్రి లోకేష్ భేటీ
ప్రి-బిల్డ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించండి
బెంగుళూరు: ఆంధ్రప్రదేశ్ లో జిసిసిలను ఆకర్షించడానికి ప్లగ్ అండ్ ప్లే మోడల్, ప్రీ-బిల్డ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధికి సహకారం అందించాలని సత్వ గ్రూపును మంత్రి లోకేష్ (Nara Lokesh) కోరారు. బెంగుళూరులో సత్వ గ్రూపు ఎండి బిజయ్ అగర్వాల్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎపిలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉంది, పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.
రియల్ ఎస్టేట్ అభివృద్ధి, వాణిజ్య, నివాస, విద్య, D&B సొల్యూషన్స్, హాస్పిటాలిటీ, రిటైల్, కో-లివింగ్, కో-వర్కింగ్ & డేటా సెంటర్లతోపాటు GCC ఆర్గనైజేషన్ గ్రౌండింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, క్లయింట్ మేనేజ్మెంట్ను నిర్మించడంలో సత్వ గ్రూప్ పేరొందింది. దేశంలోని పలు నగరాల్లో ఉనికి కలిగి ఇప్పటివరకు 142 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేసిన ఒక డైనమిక్ రియల్ ఎస్టేట్ సమ్మేళనం సత్వ గ్రూప్. 80మిలియన్ చదరపు అడుగులకు పైగా ప్రణాళికలు, అభివృద్ధి దశలో ఉన్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ రంగంలోనేగాక ఈ గ్రూప్ గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ చైన్ కలిగి ఉంది. మంత్రి లోకేష్ విజ్ఞప్తిపై సత్వ ఎండి బిజయ్ అగర్వాల్ స్పందిస్తూ… తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి ఎపిలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.













