మోదీ మాటల అంతరార్థం ఇదే: మంత్రి
మోదీ విశాఖ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యాలపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. మోదీ మాటల అంతరార్థం ఇదేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖకు ఆంధ్ర రాజధానిగా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని మోదీ మాటల్లో అర్థమని సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఈ విషయాలను విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా విశాఖ పర్యటనలో మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘విశాఖకు ఏళ్ల చరిత్ర ఉంది. నగర సంస్కృతి, సంప్రదాయం, ఔన్నత్యాన్ని నేను గౌరవిస్తాను. విశాఖను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారని, ఆ మాటలకు అర్థం మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదని అన్నారు. అనంతరం మూడు రాజధానులకు మోదీ మద్దతిచ్చినట్లేనా? అని ప్రశ్నించగా. రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయనే మోదీ మాటలకు అర్థమని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని భర్తీ చేయగల సత్తా, సాంకేతికత, సామర్థ్యం విశాఖను ఉన్నంతగా మరే ఇతర జిల్లాకు లేవని అన్నారు.













