ఎలాంటి ఆంక్షలు లేవు… నిబంధనలకు అనుగుణంగానే
రాష్ట్రంలో వినాయకచవితి వేడుకలపై ఎలాంటి ప్రత్యేకమైన ఆంక్షలు లేవని ఆంధ్రద్రేశ్ రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగానే వినాయక చవితి వేడుకలను నిర్వహంచుకోవలన్నారు. కొత్తగా ఎటువంటి నిబంధనలు అమలు చేయడం లేదన్నారు. రాజకీయాల కోసం టీడీపీ, బీజేపీ పండుగలను వాడుకోవడం దుర్మార్గమని అన్నారు. వినాయక చవితి వేడుకల కోసం ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదన్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లు ఎక్కడా ఉత్సవాలు సరిగా జరగలేదన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా చేసుకోవాలని జనం ఆశపడుతున్నారన్నారు. ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
పదేపదే రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వినాయక చవితి వేడకలపై తప్పుడు ప్రచారాన్ని దేశాదాయశాఖ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని ఇప్పుడే ఎండోమెంట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.













