Kondapalli Srinivas : ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయకర్తల్ని నియమించాలి : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
యునైటెడ్ కింగ్డమ్లోని తెలుగు వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తామని ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas ) పేర్కొన్నారు. సచివాలయంలో తన ఛాంబర్లో హాంప్షైర్ కౌంటీ అరుణ్ మమ్మలనేని (Arun Mammalaneni )తో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ( ఏపీఎన్ఆర్టీఎస్) సేవలను విస్తృతం చేయడంపై చర్చ జరిగింది. యూకేలో ఉన్న తెలుగు విద్యార్థుల వివరాలను సేకరించాలని, ప్రతి విశ్వవిద్యాలయంలో ఏపీఎన్ఆర్టీఎస్(APNRTS) ఆధ్వర్యంలో విద్యార్థి సమన్వయకర్తలను నియమించి తెలుగు సంస్వృతిపై అవగాహన పెంచాలని అరుణ్ కోరారు. అదేవిధంగా లండన్లో టీటీడీ(TTD) ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పి.శ్రీకిరణ్, శ్రీని వావిలాల తదితరులు పాల్గొన్నారు.













