Kollu Ravindra: సుపరిపాలనపై ప్రజలు సంతృప్తి : మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సుపరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు (Kankipadu, )లో మంత్రి పర్యటించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ(YCP) హయాంలో ప్రజలు బాగా విసిగిపోయారని, ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేదని తెలిపారు. మరోసారి వైసీపీ అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అహర్నిశలు శ్రమించి, నిధులు సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధివైపు తీసుకెళ్తున్నారన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ( నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ) నిధులను రహదారుల అభివృద్ధికి వినియోగించినట్లు పేర్కొన్నారు. సుమారు 90 శాతం రహదారులను పూర్తి చేసినట్లు వెల్లడిరచారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.







