Minister Kollu:అందుకే ఆ పార్టీ నాయకులు ఆందోళనలో : మంత్రి కొల్లు రవీంద్ర
వైసీపీ ఖాళీ అవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra ) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు అధికారం కోల్పోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల అరాచకాలు చేసి, ప్రజలను పీడిరచుకొని తిని, ఇవాళ నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టూ-లెట్ బోర్డు (Two-Let Board) పెట్టబోతున్నారని, అందుకే ఆందోళనలో ఆ పార్టీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. బియ్యం కొట్టేసిన దొంగతో ప్రెస్ మీట్ పెట్టించడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. దొంగలతో ప్రయాణం చేస్తున్న జగన్ రెడ్డి (Jagan Reddy) పెద్ద దొంగ అని అన్నారు. సింగయ్య మృతికి సంబంధించి విజువల్స్ అంతా క్లియర్‌గా ఉంటే తమకు ఎలాంటి సంబంధం లేదని జగన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య(Singayya) మృతితో ఎలాంటి సంబంధం లేనప్పుడు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించారని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారని విమర్శించారు.













