సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా.. వన్ టైం సెటిల్మెంట్ స్కీం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకొని రాష్ట్రంలో వన్ టైం సెటిల్మెంట్ స్కీం (ఓటీఎస్)ను అమలు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ నుంచి రుణం తీసుకొని ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా హక్కు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. హక్కు లేక రూ.15`20 లక్షల విలువైన ఇళ్లను 2`3 లక్షలకు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి ఓటీఎస్ ద్వారా సీఎం తప్పిస్తున్నారని వెల్లడించారు.
ఎంత రుణం ఉన్నా ఓటీఎస్ ద్వారా రూపాయి తీసుకోకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయిస్తోందని తెలిపారు. తద్వారా వారికి పూర్తి హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇలాంటి మంచి పథకాన్ని కొందరు పనిగట్టుకొని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 5 లక్షల మంది పేదలకు లబ్ధి కలిగించే ఈ పథకం సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రారంభిస్తామని తెలిపారు.













