కాకినాడలో లలితా జువెలరీ షోరూమ్
లలితా జువెలరీ తన 25వ షోరూమ్‌ను కాకినాడలో నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా, లలిత జ్వువెలరీ అధినేత కిరణ్‌కుమార్ బుధవారం నాడు ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. పదేళ్ళ క్రితం ఒక్క షోరూమ్‌తో ప్రారంభమైన లలితా జువెలరీ నేడు 25వ షోరూమ్‌కు చేరుకోవడం ఆనందంగా ఉందని కన్నబాబు అన్నారు. లలితా జువెలరీ ద్వారా సుమారు 32 వేల మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. వినియోగదారుల నమ్మకం, ఆశీస్సులే తమ వృద్ధికి బలమని కిరణ్ కుమార్ అన్నారు. తమిళనాడులో మరిన్ని షోరూమ్‌లతో పాటు తన సొంత ప్రాంతం నెల్లూరులో 50వ షోరూమ్‌ను ప్రారంభించాలన్నది తమ లక్ష్యమన్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు, మోడల్స్‌ను షోరూమ్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.













