అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే.. మూడు రాజధానులు
రాష్ట్రంలో మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి మూడు రాజధానులు తేవడం మా తరమో కాదే మీరే చూస్తారని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని, స్థానిక ఎన్నికల్లో మాకు 85 శాతం ప్రజలు మద్దతు రావడమే దీనికి నిదర్శనమన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబటే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గులాబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం కింద 22 కోట్లు అందించామన్నారు. పంట నష్టం కింద 13.96 లక్షల మందికి 1071 కోట్లు ఇచ్చామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టంపై అంచనాలు వేస్తున్నామన్నారు. కేంద్రం మేలు చేస్తుంటే పక్క రాష్ట్రాల్లో రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతుల విషయాల్ని రాజకీయాలు చేయొద్దని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు.













